"హెబియస్ కార్పస్” :- ఏ వ్యక్తి అయినా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అతడిని అర్హత కలిగిన అధికారి నిర్భందించవచ్చు. కాని అప్పుడప్పుడు సరియిన కారణాలు లేకుండానే ఒక వ్యక్తిని ఒక అధికారి నిర్భందించడం లేదా అరెస్ట్ చేయడం చేయవచ్చు. ఈ విదంగా వ్యక్తిని నిర్భందించడం సహేతుకమా, కాదా అని న్యాయస్థానం విచారిస్తుంది.
ఈ విధమైన నిర్భందం నుండి వ్యక్తిని రక్షించడానికి న్యాయస్థానం జారీ చేసే ప్రత్యేక ఉత్తర్వును “హెబియస్ కార్పస్” అని అంటారు.
“హెబియస్ కార్పస్” లాటిన్ పదం. దీనర్దం “Have the body” అంటే శరీరాన్ని చూపించమని అర్ధం. అంటే “నిర్భందించిన వ్యక్తిని న్యాయ స్తానానికి తీసుకు రావాలి. ఈ రిట్ లోని ఆదేశం ప్రకారం నిర్భందించిన వ్యక్తిని ఆ అధికారి వెంటనే నిర్భందించడానికి గల కారణాలను వివరిస్తూ న్యాయస్తానములో హాజరు పరచాలి.
ఆ వివరణలు సరిగ్గా లేకపోతే న్యాయస్థానం నిర్భందించిన వ్యక్తిని విడుదల చేస్తుంది. సహేతుకమహితే చట్టం పరిదిలో వ్యవహరించడానికి ఆర్డర్ ఇస్తుంది.
ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందుపర్చిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు మాత్రమే ఈ రిట్‌ను జారీ చేయడం జరుగుతుంది..అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపర్చకపోతే, ఈ రిట్ దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని కోర్టు ఆదేశిస్తుంది.
ఈ రిట్ ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ, చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తినీ నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటం. ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయొచ్చు.
మూడో వ్యక్తి (Third person) కూడా ఇందులో జోక్యం చేసుకొనే హక్కు (Locus standi) ఉంటుంది.
బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్ దాఖలు చేయొచ్చు. అందుకే దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారు.
పార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తిని నిర్బంధించినప్పుడు, కోర్టు ద్వారా నేరారోపణ రుజువై, ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు.