IPC లో వీటికి సరైన పరిష్కారం చూపడంలేదు. భారతదేశంలో మూఢనమ్మకాలను మరియు చేతబడులను నేరంగా పరిగణించే అనేక చట్టాలను రూపొందించినప్పటికి. ప్రజలలో బయాన్ని మాత్రం తుడిచి వేయలేకపోతున్నారు. ఏదైనా అవుతుందేమో అనే బయంతో బాధితులు వారి వివరాలను పోలీసులకు చెప్పడానికి ఇష్టపడరు.
IPC తో పాటు ఈ క్రింది ఇతర చట్టాలు, మూఢనమ్మకాలు మరియు చేతబడుల వంటి సంఘ వ్యతిరేక కార్య కాలపాలను నియంత్రణ చేయడం కోసం రూపొందించారు.
- ది జువెనైల్ జస్టిస్ ఆక్ట్, 2000: పిల్లలకు హాని కలిగించడానికి లేదా వారిని నియంత్రించడానికి మూఢనమ్మకాలను ఉపయోగించడం ఈ చట్టం ప్రకారం నేరం.
- ది మెంటల్ హెల్త్ ఆక్ట్, 1987: మానసిక అనారోగ్యానికి చికిత్స చేయడానికి మూఢనమ్మకాలను ఉపయోగించడం ఈ చట్టం ప్రకారం నేరం.
- ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సుయల్ అఫెన్సెస్ ఆక్ట్, 2012: పిల్లలను లైంగికంగా వేధించడానికి మూఢనమ్మకాలను ఉపయోగించడం ఈ చట్టం ప్రకారం నేరం.
చేతబడి మరియు మూఢనమ్మకాలు మీద పోరాటంలో ఈ చట్టాలు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉన్న చట్టాలు:
- బీహార్‌లో ది ప్రివెన్షన్ ఆఫ్ విచ్ (డైన్) ప్రాక్టీసెస్ యాక్ట్, 1999:
- ఛత్తీస్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్ తోనాహి ప్రతద్న నివారణ యాక్ట్, 2005:
- ఒడిషాలో ఒడిషా ప్రివెన్షన్ ఆఫ్ విచ్-హంటింగ్ బిల్లు, 2013:
- మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రీఫైస్ అండ్ అదర్ ఇన్హుమన్, ఈవిల్ అండ్ అఘోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ ఆక్ట్, 2013:
- రాజస్థాన్‌లో రాజస్థాన్ ప్రివెన్షన్ ఆఫ్ విచ్-హంటింగ్ యాక్ట్, 2015:
- అస్సాంలో అస్సాం విచ్ హంటింగ్ (ప్రొహిబిషన్, ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్) ఆక్ట్, 2015:
- కర్ణాటకలో కర్ణాటక ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ ఇన్హుమన్ ఈవిల్ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్, 2017:
మూఢనమ్మకాలు మరియు చేతబడికి వ్యతిరేకంగా ఈ చట్టాలను రూపోందించడం ఒక ముఖ్యమైన దశ. అయితే, ఈ చట్టాలు అంత ప్రభావాన్ని చూపడంలేదు. ఇది శత్రువు లేకుండా యుద్దం చేయడం లాంటిది. చట్టాల చేయడం కన్నా ముందు ప్రజలలో మూడనమ్మకాల మీద ఉన్న విశ్వాసాన్ని తగ్గించాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి.